వాడుకరి:Talapagala VB Raju

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు తలపాగల వీర భద్ర రాజు. నేను విశాఖపట్నం లో నివాసం వుంటున్నాను. ఎమ్.ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదివాను. సైన్సు, కంప్యూటర్స్, జెనెటిక్స్, అంతరిక్షం, ప్రపంచ భాషలు నాకు ఇష్టమయిన విషయాలు. తెలుగు భాష, తెలుగు వారి చరిత్ర, జర్నలిజం నా అభిమాన విషయాలు.

1943లో ప్రచురింపబడిన "ఆంధ్ర సర్వస్వము" నుండి ఒక పేజీ భాగం

బ్రిటిష్ వారి కాలంలో, తెలుగు భాషకు గుర్తింపు వుంది అనటానికి, వారి కాలంలో వున్న 'అణా' మీద 'ఒక అణా' అని తెలుగు భాష లో వ్రాసి వుండేది. ఆ గుర్తింపు, 1956 లో ప్రవేశ పెట్టిన, మెట్రిక్ సిస్టమ్ లో (రూపాయలు, పైసలు) పోయిందని, అదే గుర్తింపును మన భాషకు తిరిగి తేవాలి అని గుర్తు చేస్తున్నాను. 'తెలుగు వాడిగా పుట్టటం, తెలుగు భాష మాట్లాడటం, పూర్వ జన్మ సుకృతం' అన్న 'అప్పకవి' (తమిళుడు) మాటలు తలుచుకుని ప్రతి తెలుగు వాడూ గర్వ పడాలి. దేశభాషలందు తెలుగు లెస్స అని నమ్ముతాను.

ఈ నాటి చిట్కా...
పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలు

నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?

సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును. బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. అప్లోడ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు ఇవ్వండి. సరియైన మూసలతో వివరాలు చేర్చబడతాయి. ఉదాహరణలకు ఇప్పటికే ఎక్కించిన అటువంటి చిత్రాల పేజీలు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

గుర్తింపు పతకాలు[మార్చు]

చరిత్రలో_ఈ_రోజు_క్యాలెండర్‌ మెరుగు పరచటంలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా ఈ పతకం సమర్పిస్తున్నాను (ఆలస్యమైనందుకు క్షమించండి). అర్జున